Ticker

6/recent/ticker-posts

కారుణ్య నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ


ఏలూరు, ఫిబ్రవరి 28: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ హెడ్ కానిస్టేబుల్ కె. రత్నరాజు మరణంతో వారి కుటుంబానికి కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు.


కృష్ణ జిల్లా పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కె. రత్నరాజు భార్య శ్రీమతి సుజాతకు కారుణ్య నియామక విధానం ప్రకారం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామక విధానం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్యచంద్రరావు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.