ANDRAPRADESH: ఇదిలా ఉంటే ముద్రగడ కాపుల గురించి ఏమి మాట్లాడినా గతంలో ఆయనకు మద్దతు ఉండేది. ముద్రగడ పద్మనాభం. అలియాస్ పద్మనాభరెడ్డి. ఆయన వైసీపీలో కీలక నాయకుడిగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల ముందు ఒక భీకరమైన శపధం చేశారు. తాను జనసేన అధినేత పవన్ ని పిఠాపురంలో ఓడిస్తాను అని. ఒకవేళ అది సాధ్యపడకపోతే తన పేరు మార్చుకుంటాను అని. నిజానికి ఈ సవాల్ ఆయన తానుగా చేశారు, ఎవరూ చేయమనలేదు, ఆవేశంతో చేసిన ఈ సవాల్ ని ఆ తరువాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ ముద్రగడ మాత్రం పట్టుదలగా తన పేరుని మార్చేసుకున్నారు.
అదే బూమరాంగ్ : ముద్రగడకు అదే బూమరాంగ్ అయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం స్పష్టంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని పిఠాపురం జనాలు డిసైడ్ అయ్యారు. ఇవన్నీ రాజకీయంగా విశేష అనుభవం కలిగిన ముద్రగడకు తెలియవా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఆయన తొలుత జనసేనలో చేరాలని అనుకున్నారని ఆ తరువాత అడుగులు వైసీపీ వైపు పడ్డాయని మరో ప్రచారం సాగింది. ఇక వైసీపీలో ఉంటూ ముద్రగడ పవన్ మీదనే రాజకీయ యుద్ధం ప్రకటించడం కాపు సామాజిక వర్గానికి నచ్చలేదని అంటారు. దాంతో నాటి నుంచే ముద్రగడ పట్ల కాపులు కొంత ఎడం పాటిస్తున్నారు అని అంటున్నారు.
ఏమి మాట్లాడినా : ఇదిలా ఉంటే ముద్రగడ కాపుల గురించి ఏమి మాట్లాడినా గతంలో ఆయనకు మద్దతు ఉండేది. కానీ ఇపుడు మాత్రం ఆయన మాటలు చేస్తున్న ప్రకటనలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేస్తున్నది కూడా ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులే అని అంటున్నారు. తాజాగా ముద్రగడ అంబటి రాంబాబుని పరామర్శించడానికి ఇంటికి వెళ్ళారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆయన కాపుల మీద టీడీపీ దాడులు అదే పనిగా చేస్తోంది అని విమర్శించారు. ఎపుడు అధికారంలోకి టీడీపీ వచ్చినా కూడా ఇదే విధంగా చేస్తున్నారు అని 2016లో తనను 2026లో అంబటి రాంబాబుని ఇలా దాడులు చేసి కుటుంబాల మీదకు వచ్చారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ నేతగానే : సహజంగా ముద్రగడ మాట్లాడితే కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావాలి. కానీ ఆయన కామెంట్స్ ని సొంత వారే వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం పెద్దాయనగా ఉన్న ముద్రగడ నిలకడ లేని రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఆయన పేరుని పద్మనాభరెడ్డి అని మార్చుకోవడం కూడా ఎవరికీ అసలు నచ్చడం లేదుట. దాంతో వైసీపీ నేతగానే ముద్రగడను చూస్తున్నారు తప్ప కాపుల కోసం ఉద్యమించిన గత ముద్రగడగా భావించడం లేదుట. దాంతో పెద్దాయన మ్యాజిక్ గోదావరి జిల్లాలో పెద్దగా పనిచేయడం లేదని అంటున్నారు. మరి ముద్రగడ ఈ విషయాల మీద విశ్లేషణ చేసుకుని బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా తిరిగి తన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.


.jpeg)
