జంగారెడ్డిగూడెం: వైద్యం అనేది దైవదత్తమైన సేవ అని, అది ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలంటే సమాజంలోని ప్రతి వర్గం నుంచి ప్రోత్సాహం అవసరమని వక్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్డులో లక్ష్మి టాకీస్ సెంటర్ సమీపంలోని ఎస్‌ఆర్ కాంప్లెక్స్‌లో ప్రముఖ Dr. Agarwal’s Eye Hospital నూతన క్లినిక్‌ను రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, డిసిసిబి మాజీ చైర్మన్ రాష్ట్ర కాపు నాయకులు రాంబాబు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ, ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలకు అత్యాధునిక నేత్ర వైద్యం అందుబాటులోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం ద్వారా అనేక మందికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
సంస్థ మెడికల్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ క్లినికల్ సర్వీసెస్ డా. సత్తి విజయ, ఏపీ ఇన్‌చార్జి రాజేష్, మేకా శ్రీకాంత్ తదితరులు అతిథులను ఆహ్వానించారు. పూజా కార్యక్రమం అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఏపీ ఇన్‌చార్జి రాజేష్ మాట్లాడుతూ, తమ క్లినిక్‌లో ప్రాథమిక స్థాయి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే శస్త్రచికిత్సలు చేయాల్సిన రోగులను సమీపంలోని రాజమండ్రి, ఏలూరు కేంద్రాలకు రిఫర్ చేస్తామని వివరించారు. వారానికి రెండు రోజులు అదనపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఈ కేంద్రంలో ఇద్దరు ఆప్టోమెట్రిస్టులు అందుబాటులో ఉంటారని, నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్రాలతో సేవలందిస్తున్న తమ సంస్థకు ఇది 351వ బ్రాంచ్ అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, పరిమి సత్తి పండు, ఎస్సార్ కాంప్లెక్స్, ఎస్ ఆర్ టి వి అధినేత సింగంశెట్టి సత్యనారాయణ (సత్యరాజ్), కొండ్రెడ్డి కిషోర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, అర్జుల మురళీకృష్ణ, పెనుమర్తి రామ్‌కుమార్, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, ముప్పిడి వీరాంజనేయులు, బత్తిన చిన్న, బొబ్బర పాల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
_11zon.png)

.jpeg)
