Ticker

6/recent/ticker-posts

ద్వారకా తిరుమలరావుకు ఈయూ సత్కారం


విజయవాడ: ప్రజా రవాణా సంస్ధ (ఆర్టీసీ) ఎండీగా పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావుకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ హౌస్‌లో వీడ్కోలు సత్కారం నిర్వహించారు. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పాటు ఆయన విశేష సేవలు అందించారని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేశారని.. ఉద్యోగుల్లో ఆత్మస్తైర్యాన్ని నింపి ఆర్టీసిని ముందుకు నడిపించారని కొనియాడారు. 


ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించి సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ద్వారకా తిరుమల రావు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ యం.డి.ప్రసాద్‌ వీరితో పాటు యూనియన్‌ రాష్ట్ర, జోన్‌, జిల్లా నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.