Ticker

6/recent/ticker-posts

భూహక్కులు పరిరక్షణకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతుల్లో ఆనందం.


రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం.
డేటా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా రైతులు మెచ్చే విధంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ... 

ఏలూరు/ ముసునూరు, ఫిబ్రవరి 02: ముసునూరు మండలం కొర్లగుంట గ్రామ సచివాలయ ప్రాంగణంలో సోమవారం మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులకు  పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఏపిలో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రైతులు, ప్రజలు అంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. భూములు రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కొత్త పాసు పుస్తకాలు పంపిణీని రైతులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపణీపై ముఖ్యమంత్రి ప్రత్కేక దృష్టి సారించారని, రాష్ట్రంలో ప్రతిమాసంలో జరిగే  కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు అవుతున్నారని అన్నారు. 1923 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు సర్వే చెయ్యగా, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2024-25 గత ప్రభుత్వం మొదలు పెట్టనా తప్పులు, తడకలుతో ప్రజలకు  విపరీతమైన ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. 

టైటిల్ డీడ్ యాక్టు తీసుకువచ్చి గత ప్రభుత్వం అధినేత ఫోటోను ముద్రించుకుని అందించారని ప్రజల్లో భూముల భద్రతలో పలు అనుమానాలు తలెత్తి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటువేసి, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వ చర్యలపై అన్ని వర్గాలు ప్రజలు అసంతృప్తి నేపథ్యంలో రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుచున్నామని తెలిపారు. 
భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన ప్రజా ప్రభుత్వం లక్ష్యంమని అన్నారు. గత ప్రభుత్వం అసంబద్దంగా తెచ్చిన ల్యాండు టైటలింగు యాక్టు రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని తెలిపారు. కొత్త పాసు పుస్తకాలు పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందని, పాసు పుస్తకాలుపై తమ ఫోటోలకు నాటి పాలకులు రూ 22 కోట్లు తగలేశారని అన్నారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలని నిర్థిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అధికార్లు పనిచెయ్యాలని పేర్కొన్నారు. 

చిన్న గ్రామంలో 693 మంది పాసుపుస్తకాలు ఉండగా, సర్వేచేసిన తర్వాత తొలి విడగగా 436 మంది రైతులకు పంపిణీ చేస్తున్నామని, మిగిలినవి సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని తెలిపారు. పాత పుస్తకాలు బ్యాంకులో ఉంటే రెవిన్యూ సిబ్బంది స్వయంగా వెళ్ళి పాత పుస్తకాలు రద్దు అయ్యాయని వాటిస్థానంలో క్రొత్తపుస్తకాలు ఇస్తున్నామని, పాతవి తీసుకుని క్రొత్త పాసుపుస్తకాలు రైతులు సమక్షంలో బ్యాంకు అధికార్లకు  ఇవ్వాలని అన్నారు. 

ఎటువంటి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని అధికార్లకు మంత్రి  స్పష్టం చేశారు. రిజిస్టేషన్లు కార్యాలయాల్లో ఉద్దేశపూర్వకంగా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారం జిల్లా కలెక్టరుకు ఉందని స్పష్టం చేశారు. ఆయా అధికారులకు శాఖా పరమైన చర్యలు, అక్రమ రిజిస్ట్రేషను చేసిన వ్యక్తులుపై చట్టపరకారం చర్యలు తప్పవని  అన్నారు. ఆయా భూములు తిరిగి ఆయా కుటుంబ సభ్యులకు న్యాయబద్ధంగా అతి తక్కువ ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయించి వారికి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. 

పెన్షన్ దారులు మరణిస్తే వారి భార్యలకు వెనువెంటనే పింఛన్లు అందిస్తున్నామని, అర్హులకు పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమం త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు దశలవారీగా  పూర్తి చేస్తామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 1350 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప మనస్సుతో  సాయం అందించారని తెలిపారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, తహశీల్దారు డి.ప్రశాంతి, ఇంచార్జి యంపిడివో బి.వసంతవాణీ ప్రసాదు, మండల వివిధ శాఖలు అధికారులు, గ్రామ సర్పంచి యన్.సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి యు.సాయికుమార్, సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.