Ticker

6/recent/ticker-posts

STS మహిళా కాలేజీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు


ANDRAPRADESH, ESAT GODAWARI: సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ రాజానగరం మండలం ఈస్ట్ గోనగూడెంలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు ఫర్ ఉమెన్ (ISTS) కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని విద్యార్థులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.