Ticker

6/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో పంచామృతాభిషేకాలు – రథసప్తమి వేడుకలకు ఘన ఏర్పాట్లు


జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉన్న శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి అర్చక స్వాములు సోమవారం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

ఇదే సందర్భంగా రథసప్తమిని పురస్కరించుకొని ది.25-01-2026 ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలయంలో గల 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆవుపేడ పిడకలతో ఆవుపాలు పొంగించి, పాయసం వండి సూర్యభగవానునికి నివేదన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

అలాగే భక్తులు వెండి రూపంలో, ధన రూపంలోనూ, వెండి వస్తువులను అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, హనుమంతరావు, తుమ్మలపల్లి వెంకట రమణతో పాటు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని ప్రసాద వితరణ నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ మేనేజర్ తెలిపారు.