మిగిలి ఉన్న నిధులు జనవరి 31వ తేదీ లోగా వెచ్చించాలి,
లేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు సక్రమంగా మంజూరు కావు.
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
ఏలూరు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వ ద్వారా మంజూరు అయిన 30 స్కీములుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖలు వారీగా కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన నిధులు, ఇప్పుడు వరకు చేసిన ఖర్చు, మిగిలి ఉన్న నిధులు అడిగి తెలుసుకుని అవి జనవరి 31వ తేదీ లోగా వెచ్చించి పనులు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేసి, మిగిలి ఉన్న నిధులకు సంబంధించి పనులను జనవరి 31వ తేదీ లోగా పూర్తి చెయ్యాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. మిగిలి ఉన్న నిధులకు సంబంధించి పనులు పూర్తి చేయలేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు సక్రమంగా మంజూరు కావని స్పష్టం చేశారు.
పట్టణ, గ్రామీణ ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవి పెండింగులో ఉండకూడదని, ప్రతి శాఖ తమకు వచ్చిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలని అన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేసి, అభివృద్ధి పనులు ప్రజలకు వాడుకలోకి తేవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి, గృహనిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, ఐసిడియస్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, తదితర శాఖలు సంబంధించిన పథకాలు అమలుపై అధికార్లు ప్రత్యేక దృష్టి సారించాలని, గడువు లోగా లక్ష్యాలు పూర్తిచెయ్యని అధికారులపై శాఖా పరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు హెచ్చరించారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ యస్ ఇ జింక రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె.అమృతం, ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.హరినాధ బాబు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, సర్వశిక్ష అభియాన్ ఎపిడి పంకజ్ కుమార్, ఐసిడి యస్ పిడి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్. సూర్య చక్రవేణి, వన్ స్టాఫ్ సెంటరు అడ్మినిస్ట్రేటరు సి.హెచ్.నిర్మల, మిగిలిన సంబంధిత అధికారులు వారివారి కార్యాలయం నుండి గూగుల్ మీట్ ద్వారా పాల్గొన్నారు.


.jpeg)
