Ticker

6/recent/ticker-posts

8 నెలల రామ్‌చరణ్‌కు తుది దత్తత ఆర్డర్ — కలెక్టర్‌ వెట్రిసెల్వి చేతుల మీదుగా దంపతులకు అందజేత


ఏలూరు, డిసెంబర్, 6:  మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలోని మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా నిర్వహిస్తున్న దత్తత కార్యక్రమంలో  రెండు నెలల క్రితం ఫ్రీ అడాప్షన్ పోస్టర్ కేర్ ఇచ్చిన రామ్ చరణ్ అనే 8నెలల బాబుని తెలంగాణా రాష్ట్రం మహబూబ్ నగర్ కు చెందిన దంపతులకు తుది దత్తత ఆర్డర్ ను స్థానిక కలెక్టర్ వారి ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం అందించారు.  

బాబుని వారు చూసుకునే విధానము, పోషణ అవసరాలను తీర్చే విధానము immunization ఫాలోఅప్ మొదలగు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట బాబుతో వారికున్న అనుబంధాన్ని గుర్తించి  దత్తత తల్లిదండ్రులకు సొంత తల్లిదండ్రులుగా గుర్తిస్తూ రామ్ చరణ్ అనే బాబుకి అద్విత్ అని నామకరణం చేసి ఫైనల్ అడాప్షన్ ఆర్డర్ ను జిల్లా కలెక్టర్  వెట్రిసెల్వీ సదరు దంపతులకు  అందజేశారు 

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి  పి.శారద,  జిల్లా బాలల సంరక్షణ అధికారి  సిహెచ్ సూర్యచక్ర వేణి,  శిశు గృహ మేనేజర్ కె.భార్గవి పాల్గొన్నారు.