ఎస్.... మీరు చదివించి కరెక్టే. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చాలా మంది.. పార్టీలకు అతీతంగా ఇదే విషయం చర్చిస్తున్నారు. ఏడాది అయినప్పటికీ.. నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చించడం లేదు.
ANDHRAPRADESH:ఎస్.... మీరు చదివించి కరెక్టే. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చాలా మంది.. పార్టీలకు అతీతంగా ఇదే విషయం చర్చిస్తున్నారు. ఏడాది అయినప్పటికీ.. నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చించడం లేదు. పైగా.. ఆర్థిక పరిస్థితులు బాగోలేదని చెబుతోంది. వాస్తవానికి ఎమ్మెల్యేలకు నియోజకవర్గం అభివృద్ధి నిధులు కేటాయించాలి. ఇది నిబంధన కూడా. కానీ.. ఏడాది కాలం దాటిపోయాక కూడా.. ఇప్పటి వరకు చంద్రబాబు నిధుల గురించిఎక్కడా ప్రస్తావించడం లేదు.
దీంతో ప్రస్తుతం 50 వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించి.. సుపరిపాలనలో తొలి అడుగు కార్య క్రమం నిర్వహించినప్పుడు.. స్థానికంగా.. ఉన్న సమస్యలపై ప్రజల నుంచి విమర్శలతోపాటు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికలలో తమ ప్రాంతంలో విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేస్తామన్నారని. .కానీ ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. దీనిపై ఓ ఎమ్మెల్యే మౌనం వహించారు. ఇది చిన్నదే అయినా.. చేసేందుకు నిధులులేవు.
గత 2014-19 మధ్య చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించారు. ప్రతి ఆరుమాసాలకు కనీసంలో కనీసం 2 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. అయితే.. ఇప్పుడు ఆ మాటేలేదు. వైసీపీ హయాంలోనూ.. ఇలానే జరిగింది. ముందు అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం జగన్.. ప్రతి నియోజకవర్గానికి రూ. 50 కోట్ల వరకు నిధులు ఇస్తామని.. చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి కూడా నిధులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. చివరకు ఎవరికీ.. రూపాయి నిధులు ఇవ్వలేదు. దీనికి కారణం.. ప్రజలకు ఇస్తున్న సంక్షేమానికే నిధులు సరిపోవడం లేదని తేల్చడమే.
కట్ చేస్తే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవైపు సంక్షేమం.. మరోవైపు.. కేంద్రం నుంచి తెస్తున్న నిధులతో ప్రభుత్వమే నేరుగా రహదారుల నిర్మాణం చేపట్టడంతో ఇక, నేరుగా ఎమ్మెల్యేలకు నిధులు ఎందుకు? అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న గుసగుస వినిపిస్తోంది. బహుశ అందుకే కాబోలు.. గుడివాడ, నెల్లూరు రూరల్, పరుచూరు నియోజకవర్గాల్లో ఇతర మార్గాల్లో నిధులు సేకరించి పనులు చేస్తున్నారు. మరి ఇదే పద్ధతి అన్ని నియోజకవర్గాల్లోనూ సాగితే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Social Plugin