Ticker

6/recent/ticker-posts

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 4 రోజులు స్కూల్స్ కు సెలవులు..!


HYDERANAD:తెలంగాణలో బోనాల పండుగకు విశిష్టత ఉంది. బోనాల పండగ తెలంగాణ సంస్కృతిలో భాగంగా వస్తుంది. ఇక హైదరాబాద్‌ లో ఆషాడ మాసం మొత్తం ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. జూన్ 26న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా బోనాల జాతర జరిగింది.

ఇక లాల్ దర్వాజా అమ్మవారి బోనం పండగ జూలై 20న జరగనుంది. మరోవైపు బోనాల పండగ తుది వేడుకలు జూలై 21 సోమవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జూలై 21న అధికారికంగా సెలవు ప్రకటించింది. దాంతో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు అన్నీ మూత పడనున్నాయి.

జూలై 19 శనివారం రోజు.. చాలా పాఠశాలలకు హాఫ్ డే లేదా ఫుల్ డే సెలవు ఉంటుంది.. జూలై 20 ఆదివారం సెలవు.. జూలై 21 సోమవారం బోనాల పండుగ సందర్భంగా సెలవు.. ఆ తర్వాత జూలై 23 న ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల లోపం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ వంటి సమస్యలపై విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.