Ticker

6/recent/ticker-posts

మురుగన్ నేలపై అడుగుపెట్టిన పవన్ కల్యాణ్


ప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధురైకి పయనం

'మురుగ భక్తర్గళ్ మానాడు'లో పాల్గొనేందుకు తమిళనాడుకు

ఈరోజు సాయంత్రం జరగనున్న ఆధ్యాత్మిక సదస్సు

లక్షలాదిగా తరలిరానున్న సుబ్రమణ్యస్వామి భక్తులు

మీనాక్షి అమ్మవారి ఆలయ నగరం మధురైలో కార్యక్రమం

సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం

ANDRAPRADESH:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మధురై నగరంలో ఈరోజు (ఆదివారం) సాయంత్రం జరగనున్న 'మురుగ భక్తర్గళ్ మానాడు' (మురుగన్ భక్తుల మహాసభ)లో పాల్గొనేందుకు ఆయన కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమానికి లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి (మురుగన్) భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మురుగన్ కు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాలున్న తమిళనాడులో, ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న చారిత్రక మధురై నగరం ఈ సదస్సుకు వేదికైంది. 

సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, మురుగన్ కొలువైన పవిత్ర భూమిపై ఆయన అడుగుపెట్టారని ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన రాక సందర్భంగా విమానాశ్రయంలో పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు స్వాగతం పలికినట్లు సమాచారం. ఈ సాయంత్రం జరిగే సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించే అవకాశం ఉంది