Ticker

6/recent/ticker-posts

. ‘కుబేర’ టికెట్‌ ధరల పెంపు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?

mo

 

KUBERAA Ticket Prices:

టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల-కోలీవుడ్ హీరో ధనుష్ల లేటెస్ట్ మూవీ ‘కుబేర’ (KUBERAA). నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్‌‌గా నటించింది. హీరో నాగార్జున, బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలు పోషించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన మూవీ.. రేపు శుక్రవారం (జూన్ 20న) రిలీజ్ కానుంది.

‘కుబేర’ టికెట్ల ధరలు:

కుబేర మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో రూ.75 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ధరలు సినిమా రిలీజైన 10 రోజుల పాటు కొనసాగుతాయని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది.

ఆ తర్వాత రోజు నుండి మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్‌ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు.

కుబేర టికెట్‌ ధరల పెంపు కోసం మూవీ నిర్మాతలు.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా.. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పాత ధరలనే యథాతథంగా ఉంచింది.

ఏపీలో కుబేర మూవీ చూడాలంటే మల్టిప్లెక్స్‌లలో అయితే రూ. 270, సింగిల్ స్క్రీన్స్‌లలో రూ. 240 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కుబేర అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు కొనసాగిస్తోంది.