జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: రైతు పక్షపాతి ఆరోగ్యశ్రీ ప్రధాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలను తెలుగు జాతి ఎప్పుడూ మరవదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా సోమవారం ఇక్కడ నాయకులు ఆయన విగ్రహాలకు నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయ రాజు, పోలవరం పరిశీలకులు జెట్టి గురునాధరావు రావు, జడ్పిటిసి పోల్నాటి బాబ్జి, వైసిపి సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కాసర తులసి రెడ్డి, వందనపు వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ముప్పిడి శ్రీనివాస్, బత్తిన చిన్న, కౌన్సిలర్లు పి పి ఎన్ చంద్ర రావు, ఉగ్గం దుర్గా ప్రసాద్, ఎల్విఆర్, తడికిమళ్ల మురళి, అయినాల వెంకటరమణమూర్తి, కో- ఆప్షన్ సభ్యులు వెంప ఐజి, షేక్ అక్బర్, రాపోలు భావన ఋషి, కాసర బన్నీ రెడ్డి, షేక్ జిలాని, కాసర సోమిరెడ్డి, గెద్దాడ శ్రీను నివాళ్ళు అర్పించారు.
గంగానమ్మ గుడి సెంటర్ దగ్గర ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణంలో ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు కూడా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
Social Plugin