Ticker

6/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు


జంగారెడ్డి గూడెం, ప్రతినిధి: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ భావి ప్రధాని అని రాష్ట్ర ప్రధాన కాంగ్రెస్ కార్యదర్శి గౌతు సత్యేంద్ర పేర్కొన్నారు. రాహుల్ 54వ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో బుధవారం నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌతు సత్యేంద్ర బాబు మాట్లాడుతూ భారత దేశంలోని యువతకు అత్యంత ప్రియతమైన నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. వారి నాయకత్వంలో 2024 ఎన్నికలలో అహంకార పూరితమైన బిజెపికి కళ్ళం వేసి భారత రాజ్యాంగ పరిరక్షణకై పోరాటం చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అని ప్రశంసించారు.

రానున్న రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ నేడు దేశంలో బిజెపి నిత్యవసర సరుకులు పెంచే ధోరణలో బిజెపి ఉన్నదని ఇప్పటికైనా భారతదేశంలోని యువకులు కళ్ళు తెరిచి భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ప్రజాస్వామ్యం కాపాడే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరి రెడ్డి, ఏలూరు జిల్లా లీగల్సెల్ చైర్మన్ బొడ్డు వాసు, టౌన్ అధ్యక్షులు ప్రగళ్ల పాటి కాశి విశ్వనాథ్, కామవరపుకోట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల యేసు బాబు, పట్టణ సీనియర్ నాయకులు దొండపాటి పుల్లారావు, బోయిన వెంకన్న, రామకృష్ణ, బుట్టాయిగూడెం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు చిడిపి కుటుంబరావు, లింగపాలెం చింతలపూడి కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిపల్లి పెద్దిరాజు, బంటు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.