Ticker

6/recent/ticker-posts

ఏలూరు కాలువలో గుర్రపు డెక్క.. నీరు పారకుండా అడ్డుపడుతున్న తూడు


ఏలూరు-ప్రతినిధి:
ఏలూరు కాలువకు అధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టక పోవడంతో తూడు పెరిగిపోయింది. మరమ్మతులు జాడలేదు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఏర్పడిన తూడు తొలగింపుకు నిధులు విడుదల కాలేదు. వచ్చే సార్వాకై కాలువకు నీరు విడుదల చేసినప్పటికీ తూడు తొలగించని కారణంగా నీరు ముందుకు ప్రవహించే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

దీని ప్రభావం తాగునీటితోపాటు వ్యవసాయ, ఆక్వారంగాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అంటున్నారు. గుండుగొలను ఇరిగేషన్ కార్యాలయ పరిధిలోని నాలుగు మండలాల్లో గల ఆగడాల లంక ఛానల్, గుండుగొలను డిస్ట్రిబ్యూషన్ కమిటీ, దెందులూరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ, ఏలూరు మెయిన్ కాలవలో తూడు తొలగింపుకు అనుమతులు కోరుతూ ఇరిగేషన్ అధికారులు రూ. 30 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను అధికారులకు ఆలస్యంగా సమర్పించారు. ఎన్నికల నిబంధన సాకుతో ఈ నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. 

కార్యాలయ పరిధిలో సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరుగుతుంది. కాలువ ద్వారా గుండుగొలను కార్యాలయ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన వివిధ గ్రామాల తోపాటు ఏలూరు కూడా తాగునీటి సరఫరా జరగవలసి ఉంది. కానీ కాలువలు వదిలిన తర్వాత కాలువలో తూడు ఉన్న కారణంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశము లేక కాలువకు నీరు వదిలిన తొలిదశలోనే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఇక అధికారులు తమకు కేటాయించిన నీటి తీరువా నిధులతో తాత్కాలికంగా కాలువకు మరమ్మతులు చేపడతామన్న గత సంవత్సరం విడుదలకు కావలసిన 30 లక్షల రూపాయలు ఇంతవరకు విడుదల కాలేదు. 

ప్రస్తుత సంవత్సరం సైతం ఆ నిధులు విడుదల కాని కారణంగా పనులు జరగడం లేదు. ఏలూరు కాలువ ద్వారా గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ పరిధిలో నీటి అవసరాలు తీరాలంటే కైకరం వద్ద ఆరున్నర అడుగులు, గుండుగొలను వద్ద ఐదున్నర అడుగులు, దెందులూరు వద్ద నాలుగున్పర అడుగులు, ఏలూరు కాలువ తూర్పు లాకుల వద్ద మూడున్నర అడుగుల నీటిమట్టం కొనసాగాల్సి ఉంది. కానీ తూడు తొలగింపుకు నిధులు విడుదల కాని తూడు తొలగింపు కార్యక్రమం సజావుగా జరిగే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. 

దీనికి అదనంగా కాలువలోసు విపరీతంగా తూడుతో పాటు కర్ర నాచు పెరిగి ఉంది. తూడు తొలగింపు సందర్భంగా తూడుతోపాటు కర్రనాచును కూడా కాలువల కట్టివేసిన సమయంలో తొలగించి కాలువ గట్లపై దూరంగా వేయవలసి ఉంది. కానీ ప్రతి సంవత్సరం అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టక, కాలువలు వదలిన తర్వాత తూడుపై రసాయనాలు చల్లి అవి కుళ్ళిపోయిన తర్వాత ఏలూరు కాలువ పరిధిలోని ఏదో ఒక ఎస్కైప్ ద్వారా కుళ్ళిన తూడును కొల్లేరులోకి మళ్లిస్తుంటారు. 

ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేని కారణంగా నీరు సజావుగా ప్రవహించక తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రైతులు అంటున్నారు. ఇంక కాలువను వదలడానికి కొంత సమయం ఉన్నందున అత్యవసర ప్రాతిపదికన తూడు తొలగింపుకు నిధులు మంజూరు చేయడంతో పాటు ఆ పనులు కాలువల వదలడానికి ముందే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు సమీపంలో కాలువపై అదనపు వంతెన నిర్మిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన అడ్డంకులు తొలగించి దానితోపాటు ఆ ప్రాంతంలో పెరిగిపోయిన తూడు తొలగిస్తే తప్ప ఏలూరు కు తాగునీటి కష్టాలు తప్పే పరిస్థితి కనపడటం లేదు.