Ticker

6/recent/ticker-posts

ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రజాధర్బార్ చక్కనివేదిక సద్వినియోగం చేసుకోవాలి - రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు/ చాట్రాయి, ఏప్రియల్ 08: చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో బుధవారం మండల స్థాయీ ప్రజాధర్బార్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంబంధిత  అధికారులతో కలసి నిర్వహించారు.  ప్రజలు నుండి అర్జీలను స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాధర్బార్ లో వచ్చిన అర్జీలు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజాపాలనలో ప్రజలు భాగస్వామ్యం చాలా అవసరం అని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకోవడం ద్వారా వారికి సంతృప్తికరమైన పరిష్కారం జరుగుతుందని అన్నారు. అధికారులు అంతా సహకరించాలని, ఎప్పుటి కప్పుడు సమస్యలను పరిష్కరిస్తే అర్జీలు సంఖ్య తగ్గుతుందని అన్నారు. 

ప్రజా సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు క్రమం తప్పకుండా  ప్రజాధర్బార్ లు నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు, ఎక్కువ సంఖ్యలో అర్జీదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.