Ticker

6/recent/ticker-posts

పరిటాల రవీంద్రను మరువలేం.. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద


అనంతపురం: పరిటాల రవీంద్ర వంటి నాయకుడిని ఎప్పటికీ మరువలేమని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో ప్రస్తావించారు. ఢిల్లీలో ఉన్న పరిటాల సునీత శుక్రవారం పలువురు ప్రముఖులను కలిశారు. పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను ఇతర ప్రజాప్రతినిధులతోపాటు కలిశారు. 


రాజ్యసభ సభ్యులు తానా సతీష్‌, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు పురందేశ్వరి, ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, సీఎం రమేష్‌, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇతర ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు.

తర్వాత ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే సునీతను, మాజీ ఎంపీ జయప్రద కలిశారు. ఆమెను చూడగానే కుశలప్రశ్నలు వేసి, పరిటాల రవిని గుర్తుచేసుకున్నారు. పరిటాల రవి తన ప్రాంత అభివృద్ధికి ఎంతో తపించేవారని జయప్రద ఎమ్మెల్యే పరిటాల సునీతతో అన్నారు. మీ ప్రాంతంలో జరిగే ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా వస్తానని ఆమె పరిటాల సునీతతో హామీ ఇచ్చారు.