Ticker

6/recent/ticker-posts

లోక్ సభ స్థానాలు 850కి పెంపు..! ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి?


ఆంధ్రప్రదేశ్: లోక్ సభ స్థానాల పెంపునకు కేంద్రం రెడీ అయ్యింది. ఇందులో భాగంగా 131వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. ఎన్డీయే సర్కార్ కీలక ప్రతిపాదన చేసింది. లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్ సభ సీట్లు కేటాయించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. 


ఇందులో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకి రానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది కేంద్రం. ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ జరగనుంది.

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య 543. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను పెంచనుంది కేంద్రం. రాజ్యాంగ సవరణ గురించి ఇప్పటికే ఎంపీలకు సమాచారం అందింది.

లోక్ సభ స్థానాలను 850కి పెంచేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ సంఖ్య 263కి పెరగనుంది. ఇక 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆ సంఖ్య 38కి పెరగనుంది.తెలుగు న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 119. ఈ సంఖ్య 179కి పెరగనుంది. ఇక మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్య 17గా ఉంది. ఆ సంఖ్య 26కి పెరగనుంది.