భీమడోలు | ఫిబ్రవరి 5: ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో కాలువ గట్టు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్ట్‌ను భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి పరిశీలించారు. గ్రేడ్–3 సెక్రటరీ మమతతో కలిసి ఆయన చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చేపల లోడుతో వస్తున్న ఒక లారీకి మార్కెట్ ఫీజుకు సంబంధించిన రసీదును చైర్మన్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమడోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఎక్కడైనా చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి మార్కెట్ ఫీజు వసూలు చేసే అధికారం మార్కెట్ కమిటీకి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మకాయల గణపతి, భీమడోలు నీటి సంఘం ప్రెసిడెంట్ కుక్కల ప్రసాద్, ఎంసీ డైరెక్టర్ పడాల నాగు, ఆదిరెడ్డి సత్యనారాయణ, యడ్లపల్లి శ్రీరామకృష్ణ, ఎడ్ల రమేష్, వనం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



.jpeg)