Ticker

6/recent/ticker-posts

ఉగాది జాతరలో ఆధ్యాత్మిక వాతావరణం – నూకాలమ్మ ఆలయంలో విశేష కార్యక్రమాలు


జంగారెడ్డిగూడెం: పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక జాతర ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. యాగాలు, పూజలు, అన్నదానంతో ఉగాది జాతర కార్యక్రమాలు ముగిశాయి.


ప్రభాత వేళ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి చేపట్టారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

అనంతరం అమ్మవారికి నైవేద్యంగా వివిధ రకాల వంటకాలు సమర్పించి, భక్తులకు భారీగా అన్నప్రసాదం అందించారు. వేలాదిమంది భక్తులు ఈ అన్నసమారాధనలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.

జాతర సందర్భంగా విద్యార్థుల భగవద్గీత పారాయణం, భజన బృందాల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, రైతులు, వ్యాపారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందాలు, స్థానిక భక్తులు సమిష్టిగా కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు వెల్లడించారు.