ఆంధ్రప్రదేశ్ అమరావతి: బీర్ల తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉత్పత్తి వ్యయం పెరగడం. బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, కొద్ది రోజుల్లోనే తయారీ ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. ఎండలు ముదురుతున్న వేళ చల్లని బీరుతో ఉపశమనం పొందుదామనుకునే సగటు మందుబాబులకు ఇది కోలుకోలేని దెబ్బ. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల వల్ల పెరుగుతున్న రవాణా ఖర్చులు వెరసి.. ఇప్పుడు బీరు ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.
కేవలం ముడి సరుకులే కాకుండా, బాటిళ్లు, లేబుల్స్, చివరకు వాటిని ప్యాక్ చేసే కార్టన్ బాక్సుల ధరలు కూడా పెరగడంతో బ్రూవరీ కంపెనీలు గత్యంతరం లేని స్థితిలో ఈ భారాని వినియోగదారులపై మోపక తప్పడం లేదు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ ధరల పెంపు వెనుక ఉన్న కారణాలు, పెరగనున్న రేట్లు ఇలా ఉండబోతున్నాయి..
15% వరకు ధరల పెంపు! బీర్ల తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉత్పత్తి వ్యయం పెరగడం. బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, కొద్ది రోజుల్లోనే తయారీ ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు పాయింట్ల పరంగా పరిశీలిస్తే..
బాటిళ్ల ధరలు: ఖాళీ బీరు సీసాల ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ప్యాకేజింగ్ మెటీరియల్: పేపర్ కార్టన్ రేట్లు రెట్టింపు అవ్వడమే కాకుండా, లేబుల్స్, టేపుల ధరలు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి.
రవాణా: ఇంధన ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు 10 శాతం భారమయ్యాయి. ఏ బ్రాండ్ ఎంత పెరగొచ్చు? ప్రస్తుతం మార్కెట్‌లో 85 శాతం వాటా కలిగిన ఏబీ ఇన్‌బెవ్, కార్ల్‌బర్గ్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి.
కేస్ ధర: ప్రతి బీరు కేస్‌పై కనీసం రూ. 20 మేర ధరను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. చిల్లర ధర: విదేశీ బ్రాండ్లు, ప్రీమియం బీర్ల బాటిల్ ధరపై 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే, సుమారుగా ఒక్కో బాటిల్‌పై రూ. 10 నుంచి రూ. 30 వరకు అదనపు భారం పడవచ్చు.
గ్యాస్ కొరత: పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గి, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు మరో కారణం. అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం ప్రస్తుతం నడుస్తున్న ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది.
దీనివల్ల భారతదేశంలో చమురు సంక్షోభం మొదలైంది, ఇది నేరుగా రవాణా ఖర్చులను ప్రభావితం చేస్తోంది. కేవలం బీర్లే కాకుండా, ముడి పదార్థాల కొరత వల్ల ఔషధాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచేలా ఉన్నాయి.
వేసవి డిమాండ్ ప్రస్తుతం వేసవి కాలం నడుస్తుండడంతో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదే సమయాన్ని కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి వాడుకుంటున్నాయి. కంపెనీల ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల వేళ లేదా ఇతర రాజకీయ కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ పెంపునకు ఎంత వరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.
ఒకవేళ అనుమతి లభిస్తే, వేసవి వినోదం మందుబాబులకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఆర్థిక సంక్షోభం, ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో బీర్ల ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. కంపెనీలు నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ధరలు పెంచక తప్పదని వాదిస్తున్నాయి. అయితే, నిత్యావసరాలు, ఔషధాలతో పాటు ఇలా వినోద సాధనాల ధరలు పెరగడం ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం మధ్యేమార్గంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

