Ticker

6/recent/ticker-posts

గ్యాస్ సరఫరాలో పట్టణానికి వర్తించే 25 రోజుల బుకింగ్ నియమాన్ని అమలు చేయాలి


జంగారెడ్డిగూడెం: పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్యాస్ బుకింగ్ విషయంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే సమస్యపై రెవెన్యూ డివిజనల్ అధికారి కి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు అందుబాటులో లేకపోవడంతో ఏ. ఓ . కి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టణ అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులకు చివరి డెలివరీ తేదీ నుండి  సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి 30 రోజుల తర్వాత మళ్లీ గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండాలి.


అయితే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన G.O.Ms.No.243 ప్రకారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని Grade-II నుండి Grade-I మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని గ్రామీణ రూరల్ ప్రాంతం గా చూపిస్తూ పట్టణానికి వర్తించే నిబంధనలు అమలు చేయడం లేదు. దీని కారణంగా గ్యాస్ వినియోగదారులకు 25 రోజుల తర్వాత బుకింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో అనవసర ఆలస్యం జరుగుతోంది. పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా, గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్‌లో జంగారెడ్డిగూడెం పట్టణం అర్బన్ కేటగిరీ గా అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోంది.

అందువల్ల, సంబంధిత అధికారులు అయిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు వివిధ LPG కంపెనీలు (HP Gas, Indane Gas, Bharat Gas) వెంటనే స్పందించి జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలోని గ్యాస్ కనెక్షన్లను అర్బన్ కేటగిరి గా నమోదు చేయాలి. పట్టణానికి వర్తించే 25 రోజుల బుకింగ్ నియమాన్ని అమలు చేయాలి. గ్యాస్ సరఫరాలో పారదర్శకత మరియు సమయపాలనను పాటించాలి ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వ పారదర్శకతను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న బిజెపి ఈ విషయాన్ని తమరు దృష్టికి తెలియజేస్తుంది. కావున సంబంధిత అధికారులు అందరూ సమీక్ష చేసి సత్వరమే సమస్యను పరిష్కరించగలరు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పీసుపాటి వెంకట రామలక్ష్మి, వేమూరి శ్రీనివాసు, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ మాడా రామమోహనరావు, సొసైటీ డైరెక్టర్ కొంచాడ దుర్గా వరప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు, కొంచాడా దేవేంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు కుడిపూడి వెంకటేశ్వరరావు, సొలస రవికుమార్, పట్టణ కార్యదర్శి సూరంపూడి సుబ్బారాయ శర్మ బిజెపి యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సాయి సింగ్ తివారి బి కే విశ్వనాధ్, కూచిభట్ల వెంకట రామ సత్యనారాయణ తదితరులు పాల్గొని వినతి పత్రాన్ని అందజేసిన వారిలో ఉన్నారు.