Ticker

6/recent/ticker-posts

పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..


టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ప్రశంసించారు. ఇదే జోరును కొనసాగించాలని ఆకాంక్షించారు.


'ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అమోఘం. భారత జట్టు మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. టీమిండియాకు ఆల్ ది బెస్ట్' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా, వరుణ్‌, హార్దిక్‌, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇషాన్‌ నిలిచాడు.