Ticker

6/recent/ticker-posts

దారుణం.. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కిన సైకో


అన్నమయ్య జిల్లా: మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ఆమె ఇంటి పక్కనే నివసించే సైకో వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. 


నిందితుడు బాలికను కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. బాలిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు, పక్కింట్లోనే బాలిక శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.