Ticker

6/recent/ticker-posts

తండ్రి పేరుతో ఆర్ ఆర్ పౌండేషన్ ద్వారా పేదలకు బియ్యం పంపిణీ


కాపు సంక్షేమ సంఘం కె9 సభ్యుడు వంకాయల పండు వితరణ..


జంగారెడ్డిగూడెం: దివంగత వంకాయల రామారావు 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఆర్ ఆర్ పౌండషన్ అధినేత వంకాయల పండు మెట్ట ప్రాంతంలోని తొమ్మిది నిరుపేద కుటుంబాలకు ఏడాదికి సరి పడే విధంగా యాభై 25 కిలోల నాణ్యమైన బియ్యం బస్తాలు అందించారు. బుధవారం ఇక్కడి సుబ్బారెడ్డి కాలనీలోని ప్రతిభా స్కూల్ వద్దనున్న గ్రీన్ వేకన్స స్ట్ర క్షన్స్ అండ్ ఇంటీరియర్ సంస్థ కార్యాలయంలో పేదలకు బియ్యం అందించారు.

కుటుంబాన్ని బట్టి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సర కాలానికి సరిపడా ఆహారం అందించాలని బియ్యం ప్యాకెట్లను అందజేశారు. కాపు సంక్షేమ సంఘం కె 9ఆధ్వర్యంలో కష్టమొస్తే కాపు నేస్తాం అనే నినాదాన్ని అమలు చేస్తూకె 9సభ్యుడు పండు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు కె9 అధ్యక్ష కార్యదర్సులు తొమ్మిదేళ్ల శ్రీనివాస్, శీలం కృష్ణం రాజు తెలిపారు.

పండు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తమ తన తండ్రి పేరు మీద నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కనీసం వంద మంది పేదలకు ఈ విధంగా బియ్యం అందించాలానే ఆశయంతో ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్ పి టి సి మెంబర్  పోల్నాటి బాబ్జి, సిటీ కేబుల్ ఎం డి పి శ్రీనివాస్, న్యాయవాది అచ్యుతశ్రీనివాస్, కె9 గౌరవ అధ్యక్షుడు దాకారపు కృష్ణ, సంస్థ ప్రతి నిధులు కటారి వాసు, పి మోహన్, రాఘవ రాజు, అది విష్ణు, పారేపల్లి నగేష్, ప్రగఢ కిరణ్, గణిత ఆనంద ప్రసాద్, పారేపల్లి పవన్, సింగవరపు లక్ష్మి, ఉద్దండం ఏసుబాబు, కె ఎస్ శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ నేతలఅభినందన
కాగా తండ్రి జ్ఞాప కార్ధం సేవా కార్యక్రమాలు చేస్తున్న వంకాయల పండు ను స్థానిక లయన్స్ క్లబ్ ప్రతినిధులుకలిసి అభినందించారు. అధ్యక్షుడు దాసరి శేషు సభ్యులు నాగేశ్వరావు, అట్లూరి సురేష్, పండు పాల్గొన్నారు.