◆అలరించిన కళా కారులు
◆పండగల నేపథ్యంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం
ఏలూరు-ప్రతినిధి: హిందూయువజన సంఘం (వైఎంహెచ్ఏ) ఏలూరు వారి ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నృత్య దినోత్సవాన్నిపురస్కరించుకొని స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ఉభయగోదావరి జిల్లాల్లో శాస్త్రీయనృత్య ప్రదర్శనలు జరిగాయి. కళారంగంలో విశిష్టలైన 11మంది నృత్య గురువుల నిర్వహణలో 150 మందికి పైగా నృత్యవిద్యార్థులచే ప్రదర్శింప జేసిన నాట్య కళాప్రదర్శనలు ప్రేక్షకుల్ని అలరించాయి.
పండగల నేపథ్యంలో నిర్వహించిన వేడుకల్లో శాస్త్రీయనృత్యాలు ఆకట్టు కున్నాయి. ముందుగా నృత్య విద్యార్థులచే నటరాజ స్వామికి నాట్యంతో నృత్య నీరాజనాన్నిసమర్పించారు. మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. శాస్త్రీయ కూచిపూడి నృత్య రంగంలో విశిష్టమైన 11 మంది నృత్య గురువుల నిర్వహణలో 150 మంది చిన్నారులు బృందాలుగా ఏర్పడి ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకుల్ని అలరించాయి.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కళారత్న కె వి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ లునాని, ఉపాధ్యక్షులుకే క్ప్తార్, సహాయ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు, కార్యనిర్వాహ కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జికాంతారావు, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు(ఎల్ వి ఆర్) సభ్యులు నాట్య విదుషీమణి ఏ పార్వతి రామచంద్రన్, డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, నాట్యచార్య దువ్వి హేమ సుందర్, ఎం సూర్యనా రాయణ యాదవ్ మరియు నాట్యాచార్యులు, అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.

Social Plugin