Ticker

6/recent/ticker-posts

భక్త కనకదాస జీవితం అందరికీ ఆదర్శనీయం: కలెక్టర్ వెట్రిసెల్వి


 ఏలూరు, నవంబర్ 27: భక్త కనకదాస జీవితం, ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో భక్త కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్త కనకదాస గొప్ప కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్తగా విశేష గుర్తింపు పొందారని తెలిపారు. సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే కన్నడ భాషలో అనేక కీర్తనలు, కావ్యాలు రచించారని పేర్కొన్నారు.

నలచరిత్ర, హరిభక్తిసార, మోహన తరంగిణి, రామధ్యాన చరిత్ర, నృసింహ స్తోత్రం వంటి ఎన్నో రచనలు చేశారని వివరించారు. సమాజంలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన కులమతాల కంటే నిజమైన భక్తి, మానవత్వమే గొప్పవని తన జీవితంతో చాటిచెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.