Ticker

6/recent/ticker-posts

రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..


INDIA NEWS, JUL, 21: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు. ఈ వ్యూహాత్మక చర్యతో మీడియాతో పాటు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.


మొదట ఖర్గే బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు 10రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి కాంగ్రెస్ నేతలు చేరారు. అక్కడి నుంచి సుమారు 2.3 కిలోమీటర్ దూరంలో ఉన్న 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఈ ఆకస్మిక చర్య తర్వాత కాంగ్రెస్ పార్టీతో కేంద్రం చర్చలు ప్రారంభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా ధర్నా స్థలికి వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించారు.

సీక్రెట్ ప్లాన్ సక్సెస్:
మొదట పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. అయితే, సమాచారం ముందుగానే లీక్ కావడంతో పోలీసులు అడ్డుకుంటానే అంచనాతో ప్లాన్ మార్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ఖర్గే పుట్టినరోజు భోజనానికి వస్తున్నట్లుగా సీనియర్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో భద్రతా సిబ్బందికి ఎలాంటి అనుమానం రాలేదు. అక్కడి నుంచి ఒక్కసారిగా రాహుల్ గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం వైపు వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలను ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టలేకపోయాయి.