Ticker

6/recent/ticker-posts

పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..


INDIA NEWS, JUL, 26: ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలపై ఒక హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగం పెంపు, పరీక్షల భద్రత, నిర్మాణాత్మక మార్పులు, పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటి సిఫారసులు చేయనుంది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పలు రంగాల్లో నిపుణులైన వారు సభ్యులుగా ఉన్నారు.


కమిటీ సభ్యులు వీరే:
* ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి (చైర్మన్)
* మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్
* మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా
* ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి
* మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్
* లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియోలో ఈ కమిటీ గురించిన వివరాలు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు కొనసాగిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సోమవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లులో పేపర్ లీక్‌లు, పరీక్షా మోసాలపై మరింత కఠినశిక్షలు, వేగంగా దర్యాప్తు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటివి ఇందులో ఉంటాయి.