ANDRAPRADESH, VISAKHAPATNAM, JUL, 14: బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. జబ్బర్ తోటలో ఆరుగురు మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను కలిసిన జగన్.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు.
అంతకుముందు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గ మధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున మాజీ సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్.. ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. పర్యటనలో భాగంగా జగన్ పలుచోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆయన విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గల్లంతైన మత్స్యకారులు:
కారె సీ తోడు
కారి చిన్నయ్య
అమర అప్పల రాజు
మెడ చిన్న అమ్మోరు
కారె గరగయ్య
రాగుతూ బండయ్య
బ్రతికి బయటపడ్డ బోటు డ్రైవర్ చిన్న

