Ticker

6/recent/ticker-posts

తమిళనాడు సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం....


TAMILANADAU, MAY, 08: తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి లభించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ టీవీకే అధినేత, హీరో విజయ్ గవర్నర్‌ను రెండు సార్లు కలిసినప్పటికీ అనుమతి లభించలేదు. దీంతో తాజాగా శుక్రవారం మరోసారి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 120 మంది సభ్యుల మద్దతుకు సంబంధించి జాబితాను విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపోతే శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకే అధినేత విజయ్ తన మద్దతు దారులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ రాజేంద్రఅర్లేకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు 120 మంది ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు.

ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాణ స్వీకారానికి టీవీకే ఏర్పాట్లు చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్‌తోపాటు కొందరు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది అని తెలుస్తోంది. ఇకపోతే సోమవారం లేదా మంగళవారం పూర్తిస్థాయిలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.