Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో 13 మంది సర్పంచులు, 324 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం



ఏలూరు, నవంబర్ 22: ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో 13 మంది సర్పంచులు, 324 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.


జిల్లాలోని 11 మండలాల పరిధిలో 177 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులు, 1,896 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. వీటిలో 13 సర్పంచ్ స్థానాలు, 324 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వివరించారు.

కామవరపుకోట మండలం పోలసిగూడెం నుంచి బిక్కిన వెంకటరావు, సాగుపాడు నుంచి అలవాటు విరిజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం నుంచి తేజ విశ్వనాధ్ బాబు, పొంగుటూరు నుంచి రాజనాల ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కుక్కునూరు మండలంలో అమరవరం నుంచి మోసం కన్నయ్య, దామరచర్ల నుంచి తాటి రమణ, కివ్వాక నుంచి పోడియం సమ్మక్క, తొండిపాక నుంచి కారం రమేష్, ఉప్పేరు నుంచి కుంటా ముత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పోలవరం మండలం గెడ్డపల్లి నుంచి కెచ్చెర్ల చిన్న చిన్నారెడ్డి, టి. నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి కె. ఝటేశ్వరరావు, చింతలపూడి మండలం ఉర్లగూడెం నుంచి నందిగం మహేశ్వరి, లింగపాలెం మండలం బాదరాల నుంచి మాడా నాగలక్ష్మి సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు.