ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. డ్వాక్రా గ్రూపుల మహిళలకు చేయూత అందించడానికి మరొక కొత్త పథకాన్ని వారికి అందించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలకు వ్యవసాయంలో సహాయం చేయడానికి రాయితీపై డ్రోన్లను అందించాలని నిర్ణయించాయి. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింద
మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు
ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లను అందిస్తారు. ఈ సంవత్సరం 440మంది మహిళలకు డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించిన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒక్కొక్క డ్రోన్ ధర 10లక్షల రూపాయలు కాగా, ఇందులో ఎనిమిది లక్షల రూపాయలు రాయితీగా అందించి మిగిలిన రెండు లక్షల బ్యాంకు లింకేజీ ద్వారా లేదా స్త్రీ నిధి లేదా వివో నుండి రుణంగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
88 మంది లబ్ధిదారులను గుర్తించిన సెర్ప్
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తించారు. మిగిలిన లబ్ధిదారుల ఎంపికను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు డ్రోన్లను పంపిణీ చేస్తారు. ఈ డ్రోన్లను ఏ విధంగా ఉపయోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డి హెచ్ఏజిఈ 10 రకం డ్రోన్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తోంది.
డ్రోన్స్ తో రైతులకు లబ్ది
ఈ డ్రోన్లు 15 కిలోల కంటే తక్కువ బరువు కలిగి ఉండడం వల్ల వీటిని తీసుకు వెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. ఇవి బ్యాటరీ తో పని చేస్తాయి. డ్రోన్ ను ఉపయోగించి ఎకరం పొలానికి ఐదు నుంచి ఏడు నిమిషాలలోనే రసాయనాలను పిచికారి చేయవచ్చు. రైతులు మాన్యువల్ గా రసాయనాలను పిచికారీ చేసే టైం కంటే డ్రోన్ ను ఉపయోగించి రసాయనాలను పిచికారీ చేస్తే సమయం ఆదా అవుతుంది.
నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఏపీలో అమలు చెయ్యాలని చెప్పిన చంద్రబాబు
అంతేకాదు డ్రోన్ అండ్ వినియోగించడం వల్ల రసాయనాల వినియోగం కూడా దాదాపు 10 శాతం వరకు తగ్గుతుంది. నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఏపీలోని మహిళా సంఘాల మహిళలకు అందించి వారికి డ్రోన్ వినియోగాన్ని నేర్పించడం వల్ల మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇదే సమయంలో వ్యవసాయం చేసే రైతులకు కూడా దీనివల్ల లబ్ది జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం పైన పూర్తి దృష్టి సారిస్తున్న ఏపీ ప్రభుత్వం ఏపీలో ఎంపిక చేసిన డ్వాక్రా మహిళలకు డ్రోన్లను అందించి అండగా నిలువనుంది.
Social Plugin