ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్ లోని తన ఇంట్లో స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా విధులు నిర్వర్తిస్తున్న స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జవహర్ నగర్ లోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు.. ఆమె బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు యాంకర్ స్వేచ్ఛ. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Social Plugin