ANDRAPRADESH: వైసీపీ అధినేత ఇటీవల జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కొత్త రూపంలో దర్శనం ఇచ్చారు. ఆయన నుదుట సింధూరంతో పార్టీ నాయకులకు కనిపించారు. దాంతో నాయకులు అంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఒక పండుగ కాదు, విశేషం అంతకంటే కాదు, కానీ పార్టీ సమావేశాలలో జగన్ ఈ విధంగా బొట్టుతో మెరుస్తూ కనిపించేసరికి అంతా దీని మీదనే చర్చించుకోవడం జరిగింది. ఇంతకీ జగన్ బొట్టు వెనక కధా కమామీషూ ఏమిటి అంటే చాలానే అని అంటున్నారు.
ఈ మార్పునకు కారణం :
జగన్ ఓటమి తరువాత చాలానే మారుతున్నారు. అందులో ఆయన మాటలు బాడీ లాంజ్వేజ్ తో పాటు నాయకులతో వ్యవహరిస్తున్న తీరు అన్నీ కూడా భారీ మార్పునకు సూచికలుగానే ఉన్నాయి. మరి బొట్టు సంగతి ఏమిటి అంటే హిందూత్వకు ప్రతీకగా బొట్టు అంతా పెడతారు. జగన్ కూడా హిందూ బొట్టుని తెగ వాడుతున్నారు అంటే మ్యాటరేంటి అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ దేశంలో ఒక వైపు బలంగా హిందూత్వ వాదన ఉంది. జనసేన మిత్రపక్షం కావడం వల్ల సనాతన వాదం కూడా జనం ముందుకు వస్తోంది. దీంతో ఏపీ లాంటి చోట్ల హిందూత్వ నినాదాలు వినిపిస్తున్న నేపథ్యం ఉంది.
జగన్ ఎందుకు ఇలా :
వాస్తవానికి జగన్ క్రిస్టియన్ మత విశ్వాసకుడు. ఆయన ముత్తాతల కాలం నుంచి ఆ విధంగా క్రిస్టియన్ మతాన్ని విశ్వసిస్తూ అందులోనే కొనసాగుతున్నారు. తండ్రి వైఎస్సార్ మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆయన ఎపుడైనా పండుగ అకేషన్స్ లో ఎవరైనా తెచ్చి పెడితే బొట్టు పెట్టుకునేవారు తప్ప ఆయన నుదుట బొట్టు అంతగా కనిపించేది కాదు. కానీ జగన్ మాత్రం బొట్టుని ఇటీవల కాలంలో విరివిగా వాడుతున్నారు అంటే దాని అర్ధమేంటి అన్నదే హాట్ డిస్కషన్ గా ఉంది. జగన్ బొట్టుతోనే పత్రికా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మీడియాను పలకరిస్తున్నారు. ఒక విధంగా ఆయన అలా కావాలనే హైలెట్ అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
క్యాడర్ తో సైతం అదే విధంగా :
అంతే కాదు జగన్ తన పార్టీ క్యాడర్ తో కూడా అదే విధంగా బొట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. వారితో మాట్లాడేటప్పుడు సైతం బొట్టుని ఆయన వీడడం లేదు. మరి ఎందుకీ మార్పు అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే జగన్ లో మొదటి నుంచి ఇలా ఉందా అంటే లేదు అని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయనకు అంత ఆసక్తిగా ఉన్నట్లు అప్పట్లో కనిపించలేదు అన్న మాట.
అప్పటి నుంచే రూట్ చేంజ్ :
ఏపీలో ఒక వైపు లిక్కర్ స్కాం పెద్ద ఎత్తున విచారణ సాగుతోంది. ఆ దూకుడు చూస్తూంటే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో టచ్ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో బీజేపీ వారి దృష్టిలో పడడానికి లేదా బీజేపీని ఆకట్టుకోవడానికి జగన్ ఈ విధంగా రూట్ మార్చరా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా సాగుతోందిట. ఒక విధంగా చూస్తే జగన్ బీజేపీకి దగ్గర అవుతున్నారు అని కూడా ప్రచారం అయితే సాగుతోంది అని అంటున్నారు.
అంత కాషాయ దర్శకత్వమేనా :
ఏపీలో వైసీపీకి బీజేపీకి ఏమిటి సంబంధం అంటే బాహాటంగా అయితే ఏమీ లేదు. కానీ ఏపీలో వైరి పక్షంలో వైసీపీ ఉండాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంలో భాగం అని అంటున్నారు. ఏకపక్షంగా ఒకే ప్రాంతీయ పార్టీకి రాజకీయం సొంతం అయితే అపుడు ఏపీలో బీజేపీ వ్యూహాలు ఏవీ సాగవని అంటారు. దాంతో వైసీపీని పడిపోకుండా తెర వెనక నుంచి నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది అన్న ప్రచారం అయితే ఉంది. అందులో భాగమేనా జగన్ వెనక కూడా బీజేపీ డైరెక్షన్లు అని కూడా గాసిప్స్ అయితే ఉన్నాయి. అలా చూస్తే జగన్ ఒక విధంగా బీజేపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారు అని అంటున్నారు.
బీజేపీకి దగ్గర దారిగా :
బీజేపీ దేశంలో బలమైన జాతీయ పార్టీగా ఉంది. ఇప్పట్లో ఆ పార్టీని కొట్టే మరో పార్టీ లేదు. ఏపీలో చూస్తే అధికార మార్పిడి వెనక కూడా బీజేపీ వ్యూహాలు ఉన్నాయని అంటారు. దాంతో జగన్ కూడా బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారు అని చెబుతున్నారు. బీజేపీని ఆకట్టుకోవాలంటే బొట్టు అవసరం చాలానే ఉందిట. అందుకే జగన్ నుదిటిన ఎర్రగా మెరిసే బొట్టు అని అంటున్నారు. అంటే ఈ మెరుపుల వెనక ఎర్రటి వ్యూహాలేవో ఉన్నాయన్న మాట. చూడాలి మరి ఈ బొట్టు ఏ మంత్రం చేస్తుందో ఏ విధంగా వైసీపీని ముందుకు తీసుకుని వెళ్తుందో.
Social Plugin