బాద్యుడు పై చర్యలు కోరుకుతూ ఆర్డీవో కి వినతిపత్రం ఇచ్చిన ఎపి డబ్ల్యూ జే ఎఫ్
జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై అధికార తెలుగు దేశం పార్టీ నాయకుడు దాడి ఘటనను నిరసిస్తూ మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఆర్డీవో ఎం వి రమణ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సెక్రెటరీ కె ఎస్ శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్న పట్టించుకోకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మక్కువలో ప్రజాశక్తీ విలేకరి రామారావు పై దాడి సంఘటన ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని విమర్శించారు.
గత ప్రభుత్వంలో మీడియాపై దౌర్జన్యాలు జరిగితే ఖండిస్తున్నామని స్టేట్మెంట్స్ ఇచ్చిన కూటమి నాయకులే విలేకరులపై దాడులు చేయటం తగునా అని అన్నారు. ప్రస్తుతం వారి ప్రభుత్వమే అధికారంలో ఉందికదా ఇపుడు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఈవిదముగా, ఎండగడుతారో చూడాలన్నారు. మీడియా వారిపై ఆఘత్యాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి రాజకీయ నాయకుడు ఎదుగుదల కొరకు మీడియా పనిచేస్తుందని అటువంటి మీడియా ప్రతినిధులను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యాలు చేస్తూ భౌతికంగా దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
వినతి పత్రం స్వీకరించిన అనంతరం ఆర్డీవో ఎం వి రమణ మాట్లాడుతూ తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ వారికి ఈ విషయమై నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రవి కిరణ్, జిల్లా కార్యదర్శి కలపాల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు పి ఎన్ వి రామారావు, సీనియర్ జర్నలిస్ట్ కెవి రమణా రావు, యూనియన్ సభ్యులు నూజివీడు కిషోర్, సి హెచ్ కుమారస్వామి, గుర్రాల వెంకటేశ్వరరావు, పి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్, కడలి గాంధీ, అనిత, బి ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin