చింతలపూడి, ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఎపిడబ్ల్యూ జె ఎఫ్ ) డైరీ (2025)ని చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చింతలపూడి ఆయన కాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఏలూరు జిల్లా ట్రెజరర్ కె. నాగ చిన్నారావు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ జాయింట్ సెక్రటరీ ఎం. రవి, టి. సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఫెడరేషన్ కార్యక్రమాలు విస్తృత పర్చాలని సూచించారు. జర్నలిస్ట్ ల సంక్షేమంకై తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, లోకేష్ బాబు మిగతా మంత్రి మండలి పాత్రికేయుల అభ్యున్నతికి కట్టుబడి వున్నారని తెలిపారు. అర్హులకు అక్రిటిడేషన్లు, ఇతర సదుపాయాలు నిబంధనల ప్రకారం మంజూరు చేస్తామని తెలిపారు.
Social Plugin