జాతీయశిక్షణా సంస్థ 'ప్రేరణ"కు ఎంపికైన అనుశ్రీకి పలువురు శుభాకాంక్షలు..
అభినందనలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్
న్యూఢిల్లీ / ఏలూరు: జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం 'ప్రేరణ"కు ఎంపికైన ఏలూరుకు చెందిన కుమారి అనుశ్రీని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా 10 జిల్లాల నుండి 20 మందిని ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏలూరు జిల్లాకు చెందిన అనుశ్రీ ఒక్కరే ఎంపిక కావటం ఏలూరు జిల్లా ప్రజలకు గర్వకారణమని ఎంపీ పేర్కొన్నారు.
ప్రేరణ అనేది యువతలో సాధికారత కల్పించే, రూపాంతరమైన, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారతీయ వారసత్వం, సంస్కృతిని కలిపి ఆధునిక సాంకేతికపరిజ్ఝానంతో రూపొందించబడిన శిక్షణ కార్యక్రమమే "ప్రేరణ". దీనికి ఎంపికైన అనుశ్రీని పలువురు అభినందించారు. శిక్షణ విజయ వంతంగా పూర్తిచేసుకుని కుటుంబానికి జిల్లాకు పేరు తేవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
Social Plugin