Ticker

6/recent/ticker-posts

ముప్పై ఏళ్లుగా సూపర్ స్టార్ కృష్ణ పేరిట సేవాకార్యక్రమాలు


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణ, మహేష్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు బవిరిశెట్టి మురళి కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మురళి కృష్ణ నిర్వాహణలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

అలాగే ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులు వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కృష్ణ అభిమానులుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. ఆయన మంచితనం సేవా గుణాలు తమకు ఆరాద్యుడుగా దైవ సమానుడిగా మార్చాయన్నారు. కృష్ణ తరువాత ఆయన కుమారుడు మహేష్ బాబు.. అలా ఆ కుటుంబ సభ్యుల అభిమానులుగా తామంతా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

కృష్ణ నటించిన చిత్రం విడుదల అయితే చాలు ఎదో ఒక రూపంలో కార్యక్రమాలు చేపట్టి ప్రేక్షకులని అలరించే వారమని అన్నారు. యువకులుగా మొదలు పెట్టిన కార్యక్రమాలు నేటికీ కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.