చింతలపూడిలో లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం
చింతలపూడి: మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలంలోని నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కార్యాలయం వద్ద గ్రామీణాభివృద్ధి సంస్థ – సెర్ప్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని యూనిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గంలో మొత్తం 800 యూనిట్లు మంజూరు చేసి ఆసక్తి కలిగిన మహిళలకు అందజేశామని చెప్పారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ‘తల్లికి వందనం’ కార్యక్రమం ద్వారా చదువుకుంటున్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా నేరుగా వారి తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు.
2045 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కార్యాలయాలు ఏర్పాటు చేసి, అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చింతం విష్ణు, టౌన్ ప్రెసిడెంట్ తాటి అప్పారావు, యర్రంపల్లి సొసైటీ చైర్మన్ తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, డీపీఎం ఎల్.హెచ్.హెచ్.కే, డీపీఎం ఎఫ్‌పీఓ పూర్ణ చంద్రరావు, పార్థసారథి, పలువురు సొసైటీల చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, కూటమి నాయకులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.


.jpeg)
