Ticker

6/recent/ticker-posts

ఇక వైసీపీకి దబిడి దిబిడే..! చంద్రబాబు, పవన్ కీలక ఆదేశాలు..!


ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయింది. తాజాగా కూటమి పార్టీలన్నీ కలిసి సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఓ సభ కూడా నిర్వహించాయి. మరోవైపు గత ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన పర్యటనల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం, అవి కాస్తా ప్రభుత్వం వర్సెస్ విపక్షంగా మారడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలిచ్చారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఓ కీలక ఆదేశం ఇచ్చారు. అదీ పదే పదే ఇద్దరూ దాన్ని అధికారుల చెవికెక్కించేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

రాష్ట్రంలో అధికారం కోల్పోయినా విపక్షంలో ఉంటూ సమస్యలు సృష్టిస్తున్న వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమ ప్రసంగాల్లో అధికారుల్ని ఆదేశించారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ల పరిస్ధితి ఎలా ఉండేదో ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇప్పుడు పోలీసు అధికారులపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు, పవన్ మండిపడ్డారు. కాబట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టొద్దని, వారిపై ఉక్కుపాదం మోపాలంటూ వీరు అధికారులకు సూచించా

పోలీసు అధికారులు రిటైర్ అయ్యాక విదేశాల్లో ఉన్నా వెంటాడుతామన్న జగన్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని పవన్ ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని అస్సలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు, అవినీతి విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు.