ఏపీడబ్ల్యూ జెఎఫ్ డైరీ 2025 ఆవిష్కరించిన పరిమి
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు..
ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం సహకారం..
జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పాత్రికేయుల సంక్షేమం సామాజిక బాధ్యతని కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చనున్నదని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు పరిమి సత్యనారాయణ(సత్తి పండు) అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కూడా ఇదే అభిప్రాయంతో వున్నారని అతి త్వరలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం సహకారం అందించనున్నట్టు పేర్కొన్నారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(ఏపిడబ్ల్యూ జె ఎఫ్) 2025 డైరీని శుక్రవారం తమ నివాసంలో సత్తిపండు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎపి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్ట్లు పాల్గొన్నారు. సత్తిపండు మాట్లాడుతూ సమాజహితంకోసం పాత్రికేయులు కృషి చెయ్యాలని జంగారెడ్డిగూడెం ప్రాంతం అభివృద్ధిలో జర్నలిస్ట్ ల పాత్ర ఎంతో ఉందని, రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని హితవుపలికారు. పార్టీలో ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించాలని ప్రచారం కోసం పోటీపడే వారిని గుర్తించి నడుచుకోవాలని సూచించారు. శాసనసభ్యులు రోషన్ కుమార్ ఎప్పటి కప్పుడు సమస్యలు గురించి తెలుసుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, అలాగే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జిల్లా సమగ్ర పురోభాభివృద్ధికి అహర్నిష్లు కృషి చేస్తున్నారని కొనియాడారు.
ప్రజా సమస్యలు ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తున్న మీడియాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ పి ఎన్ వి రామారావు స్వాగతం పలికి పరిమి సత్తిపండు పాత్రికేయుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కెవి రమణారావు పాత్రికేయుల ఇబ్బందులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కె రవి కిరణ్, కార్యదర్శి కలపాల శ్రీనివాస్, అద్దేటి వెంకటేశ్వరరావు, ఉప్పల కృష్ణ, డి.లోకేష్, గరువు బాబూరావు, బి. ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin