Ticker

6/recent/ticker-posts

నరసాపురంలో రోడ్డెక్కిన రైతులు

 


నరసాపురం రూరల్‌: ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.450 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. ధాన్యం సొమ్ము కోసం శుక్రవారం రైతులతో కలిసి నరసాపురం– పాలకొల్లు 216 జాతీయ రహదారిలోని చిట్టవరం వద్ద రాస్తారోకో చేసి రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు గంట పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌ కిలోమీటర్‌ మేర నిలిచిపోయింది. 

డీఎస్పీ గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరసాపురం, పాలకొల్లు, పొడూరు, ఆచంట ప్రాంతాలకు చెందిన పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒకానొక దశలో పోలీసులకు, రైతు సం ఘం నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయిన ప్పటికీ ఆందోళనను విరమించలేదు. జిల్లా అధికారులు వచ్చిన స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆర్డీవో అంబరీష్‌ సంఘటన ప్రదేశానికి చేరుకు న్నారు. సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామాంజనే యులు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వా నికి ధాన్యం ఇచ్చి ఐదు నెలలు గడిచిం దన్నారు. 

దీనిపై తాము జిల్లా అధికారు లకు అనేక మార్లు విన్నవించామన్నారు. వాయిదాలు వేస్తున్నారే తప్ప సొమ్ము చెల్లించడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు రూ. 13వేలకోట్లను సంక్షేమానికి ఖర్చుపెట్టింది. కష్టపడి రైతు పండించిన ధాన్యానికి మాత్రం సొమ్ము ఇవ్వలేదు ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. దీంతో సోమవారం చెల్లిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కవురు పెద్దిరాజు, శ్రీనివాస్‌, కామేశ్వరరావు, సీతారామకృష్ణ, ఎం.నాగేశ్వరరావు, సత్యనారాయణ, మల్లేశ్వరరావు, గోపాలకృష్ణ, కృష్ణారావు పాల్గొన్నారు.