పేదలకు పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో3 సెంట్లు స్థలం
ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ...
సిఎమ్ చంద్రబాబు ప్రకటనపై "పరిమి సత్తిపండు" హర్షం..
ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ...
సిఎమ్ చంద్రబాబు ప్రకటనపై "పరిమి సత్తిపండు" హర్షం..
జంగారెడ్డిగూడెం-ప్రతినిధి: నూతన ప్రభుత్వం ఏర్పాటైన 50 రోజుల్లోనే రాష్ట్రంలో సమూల మార్పులు తేచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ(సత్తిపండు) అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని పేదప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు భూమితో పాటు ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్క లబ్దిదారుడికి నాలుగు లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అలాగే జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇళ్ళు ఇస్తామని చెప్పటం శుభపరిణామం అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో పేద ప్రజలకు పట్టణంలో సెంటు భూమి, గ్రామీణ ప్రాంతాలలో సెంటున్నర భూమి ఇచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులు ఒక లక్షా ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఆ చాలీ చాలని డబ్బులతో ఇళ్లను నిర్మించుకోలేక అప్పులు చేసి ఇళ్లను కట్టుకుని పేదలు అప్పులపాయ్యారని తెలిపారు. ఇంకా అనేక మందికి ఇప్పటికీ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పడంతో బడుగు, బలహీన వర్గాలపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమాల్లో పరుగులు పెడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. త్వరలోనే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ల సహకారంతో నియోజక వర్గంలో చిద్రమైన రోడ్లన్నిటినీ నిర్మించి ప్రజల కష్టాలను తొలగించడానికి కృషి చేస్తామని పరిమి సత్తి పండు తెలిపారు.
Social Plugin