జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: దళితులు ఆదివాసీల ఉపాధి మెరుగుదలకై ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మంజూరు చేసి అమలు చేయాలని ఇఫ్టూ రాష్ట్ర కోశాధికారి కెవి విరమణ డిమాండ్ చేశారు. జులై 17 నుండి ఆగస్టు 6 వరకు దళితుల ఆత్మరక్షణ కార్యక్రమాలు గౌరవ పోరాటాలకు మద్దతుగా సభలు సమావేశాలు నిర్వహించాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బోసు బొమ్మ సెంటర్లో గంపల శీను అధ్యక్షతన సభ జరిగింది.
ఈ సభలో కె వి రమణ మాట్లాడుతూ మానవ జీవితంలో ముఖ్యంగా భారతదేశంలో తరతరాలుగా కులాల పేరున అంటరాని వారిగా చిత్రీకరిస్తూ వెనకబడి ఉన్న దళిత ఆదివాసిల ఆభివృద్ధికి వారు ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతిక రాజకీయంగా వెనుకబడి ఉన్నవారికి వారిని సమాజంలో అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. తీసుకురావడం కోసం గతంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసేవని, అటువంటి సంక్షేమ పథకాలను నిలుపుదల చేశారని ఇది దుర్మార్గమైన చర్య అని దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలు చేయడం లేదని అవి వెంటనే అమలు చేయాలని రమణ కోరారు.
కార్యక్రమంలో మద్దిపాటి లక్ష్మయ్య, గంపల శ్రీను, రామకృష్ణ, మర్లపాటి సుబ్బారావు, ఎండ్రపాటి శ్రీను, వసంతాటి సత్తయ్య, కలపాల రాము, కలపాల రామయ్య, బొబ్బిలి సూరిబాబు, సూదిపాము జయరాజు, మరలపూడి రాము, మద్దిపాటి నాగు, మద్దిపాటి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin