జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: వర్జీనియా పొగాకు రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించే కోటాకు మించి అమ్మే అదనపు పొగాకు పంటకు పెనాలిటి లేకుండా విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. పొగాకు రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్టు పొగాకు వేలం కేంద్రం.1 రైతు సంఘ అధ్యక్షుడు ఘంటసాల గాంధీ గురువారం తెలిపారు.
వర్జీనియా పొగాకు పంటను రైతుల పెనాలిటి.. సెస్సు లేకుండా అమ్ము కోవచ్చు. ఈ మేరకు గాంధీ గురువారం మీడియాతో మాట్లాడుతూ టొబాకో బోర్డు 1 ప్రెసిడెంట్ గా తాను రైతులు తరఫున బోర్డ్ లో ఇచ్చిన పరిమితి కంటే ఎగస్ట్రా పొగాకు అమ్మే రైతులు ఏ విధమైన సెస్సు లేకుండా పొగాకు అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కృషితో ఇది సాధ్యం మయ్యిందని తెలిపారు. మీడియా సమావేశంలో ములగలంపల్లి సొసైటీ మాజీ అధ్యక్షులు గంగిరెడ్డి రాఘవయ్య, రైతు నాయకులు అడ్డగర్ల సుబ్బారావు, ఘంటసాల పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin