Ticker

6/recent/ticker-posts

ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేత


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువన గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయం నిండు గర్భిణీమాదిరి కనిపిస్తోంది. 

వరదనీరుతో జలాశయం పోటెత్తుతుంది. తెలంగాణ బోర్డర్ లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మాహోగ్ర రూపంలో ఎర్ర కాలవ ప్రవాహం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లో పంట పొలాలును మంచి వేసింది.

కొత్తగా వేసిన వరినాట్లు నాటటానికి సిద్ధం చేసిన నారు మళ్ల్లు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా అధికావర్ష పాతానికి పొంగుతున్న కొండ వాగులతో ఏజెన్సీలో రహదారుల్లో బంద్ వాతావరణం నెలకొంది. స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించగా ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బంది రాక ఖాళీగా ఉన్నాయి.