రాష్ట్ర కాపునాడు ప్రచార కార్యదర్శి అది సత్యనారాయణ విజ్ఞప్తి
ఏలూరు, ప్రతినిధి: రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మద్దతు మూలంగానే వైసిపిని గద్దె దించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం సాధ్యం అయ్యిందని, ఇది మరో స్వాతంత్ర్య పోరాటం అని కాపునాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి అది సత్యనారాయణ అన్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ గెలుపునకు ఎంతో కృష్జి చేశామని ఆయన విజయం చరిత్రలోనే గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం, బిజెపి, జనసేన సమిస్టీగా పోటీ చేయడం కాపు, తెలగా, వంటరి సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూటమికి ఏకగ్రీవంగా మద్దతు నివ్వడం ఈ విజయానికి కారణం అని ఆయన విశ్లేషణ చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏక పక్షంగా రావడానికి మిగతా వర్గాల తోపాటు అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గం కృషిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గమనించాలని చూచించారు. ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ వేరవక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వ బోనని పొత్తు విషయంలో టికెట్లు కేటాయించిన సందర్భంగా ఎంత మంది వారించినా కూటమికి కృషి చేశారని గుర్తుచేశారు.
బిజెపితో కలవడానికి ఎన్ డి ఏ లో భాగస్వామ్యం రావడానికి పవన్ కృషి త్యాగం ఎంతో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కాపులు ఎదగడానికి వప్పుకొరని అందరూ అనుకుంటున్నట్టుగా ప్రచారంలో ఉన్న అంశాలు నిజం కాదని నిరూపించాలని ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన ఎమ్మెల్యేలను గుర్తించాలని అది సత్యనారాయణ చూచించారు. రెండు సామాజిక వర్గాలకు ఉమ్మడి శత్రువు ఎవరో అర్ధం అయ్యింది కనుక కాపులను కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరారు.
కలిసి ఉంటే కలదు సుఖం అని అన్ని వర్గాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.బిసిలకి ప్రాధాన్యత ఇచ్చిన కూటమి నేతలు ఎస్ స్సి, ఎస్ టి వర్గాల వారికి కూడా అదే స్థాయిలో విలువ నివ్వడం విశేషం అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చరిత్ర కెక్కిన ఆంద్రప్రదేశ్ కు దిశా నిర్ధేశం చేసే నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. ఎన్ డి ఏ లో మళ్ళీ చక్రం తిప్పే అవకాశం ఎపి కి వచ్చిందని ఈసారైనా రాష్ట్రానికి మేలు జరిగే రీతిలో హోదా అంశంపై అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Social Plugin