Ticker

6/recent/ticker-posts

కలక్టర్ ను కలిసిన ఏలూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శంకర రావు, కళ్యాణ్..


ఏపీడబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపిన జిల్లా నాయకులు


ఏలూరు: ఏలూరు జిల్లా మీడియా అక్రిడి టేషన్ సభ్యులుగా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ తరపున నియమించి బడిన ఆంధ్రప్రభ జంగారెడ్డిగూడెం స్టాఫ్ రిపోర్టర్ కె ఎస్ శంకర్ రావు, ఏలూరు సిటీ న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ బుధవారం జిల్లా కలెక్టర్ వి వెట్రి సెల్వి ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో ఏలూరు జిల్లా ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ డి జబీర్, హరీష్ తదితర సభ్యులు వున్నారు. 

కాగా రాష్ట్ర ఐ అండ్ పి ఆర్ కమీషనర్  ఏపీడబ్ల్యూ జె ఎఫ్ ఏలూరు జిల్లా మీడియా అక్రిడిటేషన్ సభ్యులుగా శంకర రావు, ఏపీ బి జె ఏ సభ్యుడు కళ్యాణ్ లను అప్పాయింట్ చేసారు. వీరి పదవి కాలం రెండేళ్లు.
మరో రెండు మూడు రోజుల్లో (జనవరి నెల చివర్లో) జిల్లా మీడియా అక్రిటిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. పలు జిల్లా ప్రభుత్వశాఖలఅధికారులు కూడా ఈ కమిటీ లో సభ్యులుగా వున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారంఅర్హత కలిగిన జర్నలిస్ట్ లకు వారి పత్రిక లేదా న్యూస్ ఛానల్ లో పనిజేస్తున్న జర్నలిస్ట్ లకు గుర్తింపు అక్రిడిటేషన్ లు ఈ కమిటీ ద్వారా మంజూరు చేస్తారు. మీడియాలో వున్న వారికి ఇది ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు. ఇందులో జిల్లా స్థాయి గుర్తింపు కలిగిన వారు జిల్లాలో ఉచితంగా ఆర్ టిసి లో ప్రయాణం చెయ్యవచ్చును. స్టేట్ పాస్ పొందిన వారు రాష్ట్ర పరిధిలో మూడో వంతు టికెట్ ఛార్జితో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్ టి సి సూచించిన సర్వీస్సుల్లో ప్రయాణం చేయ్యవచ్చు. అలాగే ప్రభుత్వం విలేకరులకు సమాకూర్చే సదుపాయాలు పొందవచ్చు.